జయరాం కేసు లో మరో ముగ్గురు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇంకా కూడా విచారణ జరుగుతుంది దర్యాప్తు చేస్తున్న పోలీసులు రోజురోజుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడిస్తున్నారు. ఎంత సాగదీస్తున్నా ఈ కేసు అంతే సాగుతుంది. ఒక నిందితుడు రాకేశ్ తో మొదలై ఆపై ఒక లేడి ఆపై ఇక చాలా మందికి ఈ కేసు లో హస్తం ఉన్నట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. విచారణ లో భాగంగా అందిన పలు కొత్త అంశాలని ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ, వెస్ట్ జోన్ నేడు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేశారు.

చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలియజేశారు.. ముగ్గురిలో విశాల్, నగేష్ ఇద్దరు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. విశాల్ అనే వ్యక్తి జయరాం హత్య జరిగినప్పుడు రాకేష్ తో కలిసి అక్కడే ఉన్నాడు.. నగేష్ అనే వ్యక్తి కొన్ని వీడియోలు తీసిన దాంట్లో సహకారం అందించాడు.. సుభాష్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి రాకేష్ రెడ్డి కి స్నేహితుడు , అతని నుండి మర్డర్ కి సంబంధించిన కొన్ని వస్తువులను స్వాదీనం చేసుకున్నాం అని ఆయన అన్నారు.

ఆయన మాట్లాడుతూ.. రాకేష్ రెడ్డి జయరాం ను మర్డర్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు సుభాష్ చంద్ర రెడ్డి కి పంపాడు. ఫథకం ప్రకారం కిడ్నాప్ చేసి, బెదిరించి కొన్ని డాక్యుమెంట్లు పై సంతకాలు తీసుకుని హత్య చేశారు. పోలీసు ఉన్నతాదికారుల ప్రమేయం పై విచారణ కొనసాగుతోంది.. ఐదు మంది పోలీసులకు నోటీసులు ఇస్తాం, విచారణ చేస్తాం..

జయరాం హత్య అయినట్లు కారు డ్రైవర్ శ్రీఖా చౌదరికి చెప్పాడు. శ్రీఖా చౌదరికి ఈ మర్డర్ తో ఎటువంటి సంభందం లేదు అని రాకేష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో దాదాపుగా 100 మందికి పైగా విచారణ చేశాము. ఈ కేసులో శ్రీఖా చౌదరిపై నమోదైన అక్రమ చొరబాటు, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు అనేదాని పై కేసు నమోదు చేశాము. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. హత్య జరిగిన తరువాత రాకేష్ రెడ్డి ఒక్కడే డెడ్ బాడీ ను తీసుకెళ్లాడు. మొత్తం డెడ్ బాడీనీ 10 మంది వరకు చూసి ఉంటారు, చూసిన అందరికి ఈ హత్య కేసులో సబంధం లేదు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: