రానా ఆరోగ్యం సర్దుకున్నట్లేనా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా నటుడు రానా పై కొన్ని కధనాలు వినిపిస్తున్నాయి. అతని ఆరోగ్య పరిస్తితి సరిగా లేదని కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నదని కొన్ని మీడియా చానల్స్ లో వార్తల్లో వినిపిస్తున్నాయి. అయితే నిజానికి కూడా రానా కి కిడ్నీ సమస్య ఉందట.. ఇవన్నీ రూమర్స్ మాత్రమే కాదని తాజాగా తెలిసింది. అయితే ‘బాహుబలి’ సినిమా కోసం ఎక్కువ మొత్తం బరువు పెరగడం కూడా రానా ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు డాక్టర్లు తేల్చారు.

ఈ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని మీడియా హౌసెస్ కి విషయం లీక్ కావడంతో రానా ఆరోగ్య పరిస్థితి వార్తల్లో నిలిచింది. కిడ్నీ ఇవ్వడానికి డోనార్ కూడా దొరికారని త్వరలోనే ఆపరేషన్ జరుగుతుందని అన్నారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అతడికి కిడ్నీ సమస్య ఉన్నప్పటికీ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ మాత్రం చేయడం లేదట. కొందరు డాక్టర్ల బృందం ప్రత్యేకంగా రానా ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారట. మెడికేషన్ ద్వారానే రానా ఆరోగ్యాన్ని సరి చేయవచ్చని, ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: