కిమ్-ట్రంప్ ల ఆసక్తికర భేటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు వైర దేశాలు అంటే అందరికీ గుర్తొచ్చేవి ఇండియా పాకిస్తాన్ మరియు అమెరికా నార్త్ కొరియా..! అయితే వీటిల్లో ఏ రెండు దేశాలు కలిసినా చర్చలు చేసినా పోటీలు పడిన అది చాలా ఆసక్తికరంగా మారుతుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా నార్త్ కొరియా మద్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరి పై ఒకరు మాటల యుద్ధం జరుపుకున్న సన్నివేశాలు మనం చాలా చూశాం. గత సంవత్సరం ట్రంప్ పుణ్యమా అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ప్రపంచ చూపుని తిప్పుకుంది. ఆ భేటీ తరువాత నుండి ఇరు దేశాల మద్య పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయి. అయితే మళ్ళీ ఈ సంవత్సరం లో భేటీ ఉండబోతుందనే విషయం తెలిసిందే. అయితే ఆ భేటీ జరిగే సమయం వచ్చేసింది ట్రంప్ వియేట్నంకి వచ్చేశాడు కిం కూడా చేరుకున్నాడు. ఇక ఆ భేటీ వియత్నాం లోనే జరగబోతుంది.

కాగా, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌‌తో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి భేటీ అవుతున్నారు. బుధవారం వియత్నాం రాజధాని హనోరులో జరిగే ఈ భేటీకి మంగళవారమే విచ్చేసిన డొనాల్డ్ ట్రంప్, పాక్‌ పై పరోక్ష హెచ్చరికలు కూడా అచేసిన విషయం తెలిసిందే. గత గతేడాది జూన్‌లో ఏడాదిన్నర మాటల యుద్ధం అనంతరం ట్రంప్-కిమ్ తొలిసారిగా సింగపూర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. తరుచూ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తూ కంటిలో నలుసులా మారిన కిమ్‌ను అమెరికా తనదైన శైలిలో దారిలోకి తెచ్చుకుంది. గత 55 ఏళ్లలో ఉత్తర కొరియా అధ్యక్షుడు వియత్నాంలో పర్యటించడం ఇదే తొలిసారి. రెండు రోజులపాటు ట్రంప్, కిమ్ మధ్య వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: