ఉపాధ్యాయుడే అత్యాచార చేసిన వేళ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడైన వేళ. పాఠాలు చెప్పి మంచి బుద్ధి నేర్పల్సిన ఉపాధ్యాయుడు తానే బుద్ధిహీనుడై ఓ విధ్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్న ఉపాధ్యాయుడు కొంత దూరం వెళ్ళిన తరువాత రోడ్డు నిర్మానుష్యంగా ఉండటం చూసి బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముర్గంలా మారి వరుస మరిచి ఈ చర్య కి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా వేపాడ మండలం కుంపల్లికి చెందిన గుమ్మాల కొండబాబు విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం ఎల్‌.ఎన్‌.పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై దేవరాపల్లి నుంచి తురువోలు వెళ్తున్నాడు. దేవరాపల్లి మండలానికి చెందిన ఓ బాలిక తురువోలు ఉన్నత పాఠశాలకు అదే మార్గంలో నడిచి వెళ్తోంది. ఆమెను స్కూల్‌ వద్ద దింపుతానని చెప్పి కొండబాబు బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో అతడిలోని కీచకుడు బయటికొచ్చాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో బైక్ ఆపిన విద్యార్థినిని సమీపంలోని పూరిపాకలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక కేకలు విన్న కొందరు నిందితుదిని పోలీసులకి అప్పగించారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చీడికాడ ఎస్సై ఎల్‌.సురేశ్‌కుమార్‌ చెప్పారు. నిందితుడు కొండబాబును సస్పెండ్‌ చేస్తూ విశాఖ డీఈవో ఉత్తర్వులిచ్చారని చీడికాడ మండల విద్యాశాఖాధికారి కె.గంగరాజు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: