వరంగల్ లో ప్రేమోన్మాది యాసిడ్ తో దాడి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరంగల్ నగరం లో రవళి అనే యువతి పై ఒక ప్రేమోన్మాది (సాయి అన్వేష్) అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. ఆ యువకుడిని దూరం పెట్టిన తన ప్రేయసి పై యాసిడ్ పోసి అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన దృశ్యం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రేయసి అని కూడా చూడకుండా కేవలం తనని దూరం పెట్టినందుకు ఈ చర్య కి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.

వివరాల్లోకి వెళితే.. సాయి అన్వేష్ ది వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామం కాగా, సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన రవళి, హన్మకొండ రామ్ నగర్ కిషన్ పురాలో హాస్టల్ లో ఉంటూ కాలేజీలో చదువుకుంటోంది. వీరిద్దరి మధ్యా గతంలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుండగా, అన్వేష్ ప్రవర్తన నచ్చక గత కొంతకాలంగా రవళి అతన్ని దూరం పెట్టింది.

దీంతో సాయి అన్వేష్ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈరోజు ఉదయం హాస్టల్ నుంచి కాలేజీకి బయలుదేరిన ఆమె, తరగతి గదికి చేరుకోగానే, ఆమెతో వాగ్వాదానికి దిగి, ఓ మూలకు నెట్టేసి, తొలుత యాసిడ్ పోసి, ఆపై తన వెంట తెచ్చుకున్న పెట్రోలును చల్లి నిప్పింటించాడు. ఈ ఘటనలో రవళి శరీరం 90 శాతం గాయాలతో నిండిపోగా, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రవళిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం ‘ఏపీ 36 ఎల్ 4835’ నంబర్ గల బైక్ పై వచ్చిన సాయి అన్వేష్, ఆమెపై దాడికి దిగాడు. అడ్డు చెప్పబోయిన తోటి విద్యార్థులను బెదిరించాడు. దాడి తరువాత అన్వేష్ ను పట్టుకున్న తోటి విద్యార్థులు, అతన్ని పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా గతంలో వరంగల్ లో యాసిడ్ దాడి చేసిన యువకుడిని ఎన్ కౌంటర్ చేసినట్టే, అన్వేష్ ను ఎన్ కౌంటర్ చేయాలని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్వేష్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చిన పోలీసులు, విద్యార్థులను శాంతింపజేశారు. ఈ ఘటనతో కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: