అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కారు లో నలుగురు మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, ఆ కారు మరో కారుని ఢీకోంది.. ప్రమాదంలో నలుగురు అక్కడక్కడే మృతి చందారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలో జరిగిన సమావేశాన్ని ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. అంతా సవ్యంగా సమావేశం జరిగిందని సంతోషంగా కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
గంటలకొలదీ ప్రయాణం చేసిన వారు మరో అర గంటలో ఇళ్లకు చేరుకుని విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. ఈలోగానే విధి కన్నెర్రజేసింది. వారి కారు.. మరో కారు ఢీకొన్నాయి. ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకుందామనుకున్న ఆ ఉద్యోగులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
హృదయ విదారకర ఘటనలో నలుగురు ప్రాణాలొదిలారు. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రి కణేకల్లు మండలం నల్లంపల్లి గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగించుకుని కారులో రాయదుర్గానికి తిరుగుపయనమయ్యారు. మరి కొన్ని నిమిషాల్లో ఎవరిళ్లకు వారు చేరుకుంటామని అనుకునేలోగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. వారి కారుపై ఎగిరి పడింది. కారులో ప్రయాణిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీంసాహెబ్ (55), ఆర్వో హమీద్బాష (55), ఆర్ఐ దాదాఖలందర్(45), డ్రైవర్ ఎర్రిస్వామి(40) కారులో ఇరుక్కుపోయి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కణేకల్లు, రాయదుర్గం 108 వాహనాలు క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ మల్లికార్జున, చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.