మరోసారి చొరబడ్డారు.. తోక ముడిచారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నాలుపే కానీ తెలుపు కాదు అన్నారు పెద్దలు. ఈ మాదిరిగానే పాక్ చర్యలు ఉన్నాయనడంలో ఏ మాత్రం తప్పు లేదు. భారత సరిహద్దులోకి అక్రమంగా దూరి మన జవాన్ల ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే.. ఈ నేపద్యం లో భారత దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ ప్రతీకార వాంఛ తో ఉన్నారు. మన దేశం లోకి దొంగల్లా చొరబడి మన జవాన్లను మట్టికర్పించిన పాక్ పై భారత ఎయిర్ ఫోర్స్ నిన్న ఉదయం ప్రతిదాడి జరిపింది. మన సైనికులను వారు చంపితే వారి ఉగ్రవాదులని మన సైనికులు చంపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్య ని ఏ ఒక్కరూ తప్పుబట్టలేదంటే మన చర్య తగిన చర్య అన్నట్టేగా అర్ధం. దీనినీ డైజెస్ట్ చేసుకోలేని పాక్ ఆర్మీ మరో సారి మన సరిహద్దులోకి చొరబడ్డారు. కానీ ఈసారి వారి ప్రయత్నం తోక ముడుచుకుంది. బుధ వారం ఉదయం భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. రాజౌరీ సెక్టార్‌లో ఈ యుద్ధ విమానాలు చొచ్చుకువచ్చినట్టుగా భారత రక్షణ శాఖాధికారులు చెబుతున్నారు. పాక్ విమానాలపై ఎదురు దాడికి పాల్పడి విమానాలను వెనక్కు పంపాయి. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మాద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ ఈ కవ్వింపు చర్యలకు దిగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: