భారత్ జరిపిన సర్జికల్ దాడిని డైజెస్ట్ చేసుకోలేక పోయిన పాక్ మరోసారి మన బార్డర్ లోకి చొరబడింది. ఈమేరకు ఈరోజు ఉదయం పాక్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కొన్ని ఫైటర్ జెట్లు భారత భూబాగంలోకి చొరపడిన విషయం తెలిసిందే. చొరపడడమే కాకుండా కొన్ని బాంబులని సైతం విసిరింది. అదృష్టవశాత్తు ఆ బాంబులు ఎటువంటి ప్రాణ నష్టాన్ని చేర్కూర్చలేకపోయాయి. ఆ యుద్ద విమానాలని గమనించిన ఇండియన్ ఆర్మీ విమానాలపై ఎదురు దాడి చేయగా తోక ముడుడ్చుకొని పారిపోయాయి.
ఈ ఉదయం తమ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించినట్టు భారత్ ఆరోపించడంపై పాకిస్థాన్ స్పందించింది. తమ విమానాలు వాస్తవాధీన రేఖ వెంబడి మాత్రమే ప్రయాణించాయని, తమ భూభాగంలో ఉంటూనే బాంబులను జార విడిచామని పాక్ ప్రభుత్వం తరఫున ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. స్వీయ రక్షణకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపేందుకే ఈ పని చేశామని తెలిపింది. ఇండియా మాదిరిగా తాము రాత్రిపూట రాలేదని, పట్టపగలే వచ్చామని తెలిపింది. ఇదేమీ ప్రతీకార చర్య కాదని, మిలటరీని లక్ష్యంగా చేసుకోలేదని, సామాన్యులను టార్గెట్ చేయలేదని తెలిపింది. తాము ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, పరిస్థితి ఇలా ఉండదని హెచ్చరించింది. కాగా, పాకిస్థాన్ ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు.