జగన్ ప్యాలెస్ పై బాబు విమర్శలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈరోజు ఉదయం 8.19 గంటల ప్రాంతానికి జగన్ ధంపతులు అమరావతిలో కట్టుకున్న తమ 2 ఎకరాల స్థలం ఇంటిని గృహప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గృహప్రవేశం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో విమర్శల వర్షం కురిపించారు. వైకాపా పేదల పార్టీ కాదని.. దొరల పార్ట్ అని.. ప్యాలెస్‌ల పార్టీ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

ప్యాలెస్ లో తప్ప జగన్ మరెక్కడా ఉండలేడని అందుకే హైదరాబాద్ ని వీడి రాలేకపోతున్నాడని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లినా రాజ భవనాల్లోనే జగన్ బస చేస్తారని విమర్శించారు. లోటస్ పాండ్, బెంగళూరు ప్యాలెస్‌, పులివెందుల ప్యాలెస్‌లకు తోడు ఇప్పుడు అమరావతిలో ఇంకో ప్యాలెస్‌ ఏర్పడిందన్నారు. జగన్‌ ధ్యాసంతా ప్యాలెస్‌లపైనే ఉందని.. ప్రజాసేవ పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు.

అలాగే మార్చి 1న ప్రధాని మోదీ విశాఖ రాకను నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఐకాస ఆందోళనలకు పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని సీఎం తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: