అభినందన్ పరిస్థితి ఏంటి..? అసలేం జరిగింది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత భూగర్బమ్ లోకి చొచ్చుకొచ్చాయి. అయితే ఈ విషయం గ్రహించిన భారత ఎయిర్ ఫోర్స్ ఆ యుద్ధ విమానాలపై దాడికి దిగాయి. ఈ క్రమంలో భారత్ కి చెందిన మిగ్ 21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయి అందులోని పైలట్ గల్లంతయ్యాడు. అయితే ఈ పైలట్ తమ ఆధీనంలో ఉన్నాడని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడ పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. పైలట్ గల్లంతైన విషయాన్ని భారత్ అధికారికంగా ధృవీకరించింది. కానీ అతను ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు

కేరళలోని తాంబరంలో ఉన్న ఐఎఎఫ్ అకాడమీలో అభినందన్ పనిచేస్తున్నాడు. అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్. అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ తమ బందీగా ఉన్నాడని పాక్ ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత డిలీట్ చేసింది. ఆపై అభినందన్ ని పాక్ ఆర్మీ చితకబాదిన వీడియోని కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తాను అభినందన్‌ అని చెప్పారు. తాను పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నానా అని ప్రశ్నించాడు. కానీ అవతలి వైపు నుండి సమాధానం రాలేదు. అయితే అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: