ఒకే ఇల్లు 71 దొంగ ఓట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో దొంగ ఓట్లు కలకలం బట్టబయలయ్యింది. ఒకే ఇంటి నెంబర్ తో 71 ఓట్లు ఉన్నాయని తేలింది. ఇలా ఒకే ఇంటి నుండి అన్నీ ఓట్లు ఉండటం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. తాజా రాజకీయ పరిణామాల వల్ల ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది కాగా..దీనిపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ స్టేషన్ 164లో ఒకే ఇంటి నెంబర్ తో 71 ఓట్లు ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసి.. 63ఓట్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఇంటి నెంబర్ 4-2-75 , కృష్ణ మందిరం, నెల్లూరు అడ్రస్ తో 71 ఓట్లు ఉండటాన్ని వైసీపీ నేతలు ముందుగా గుర్తించారు. దానిని ఫోటోస్టాట్ కాపీలు తీసి.. మీడియాకు అందజేశారు. ఈ న్యూస్ బాగా వైరల్ అవ్వడంతో ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: