‘భారీ’ క్యూనేట్ ‘కుంభకోణం’…!

Google+ Pinterest LinkedIn Tumblr +

హాంగ్‌ కాంగ్‌కు చెందిన క్యూఐ కంపెనీ క్యూనెట్‌ మల్టీ లెవల్ మార్కెటింగ్‌ కుంభకోణానికి పాల్పడింది. వేల కోట్లు వసూలు చేసి మోసం చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల మంది ఈ క్యూనెట్ బారిన పడి మోసపోయారు. క్యూనెట్ పేరుతో దాదాపు మూడు లక్షల మందిని ముంచేశారు. క్యూనెట్ స్కాంలో కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు 500 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశారు.

ఈ క్యూనెట్ కేసులో సినీ ప్రముఖుల హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో సినీ ప్రముఖులు షారుక్‌ ఖాన్, పూజా హెగ్డే, బొమన్‌ ఇరానీ, అల్లు శిరీష్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న ప్రముఖులు మార్చి 4న తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. లేని పక్షంలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రముఖులంతా క్యూనెట్‌ వద్ద భారీగా రెమ్యునరేషన్ తీసుకుని కంపెనీని ప్రమోట్ చేయడం ద్వారా సామాన్యులను దెబ్బతీశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: