భారత వైమానికి దళం వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తనని వెనక్కి తీసుకురడానికి భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇది గమనించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు అభినందన్ ని విడుదల చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటన పట్ల భారత ప్రజలు అందరూ అభినందన్ రాకకి వేచి చూస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో పాక్ మరో సారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది.
పాక్ మరో షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అభినందన్ ని విడుదల చేయొద్దంటూ పాక్ నేతలు కొందరు కోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అభినందన్ ని విడుదల చేయాలి అని తమ దేశస్తులు కోరుకుంటున్నారూ అని అంటూనే మరోసారి కపట బుద్ధి ప్రదర్శిస్తోంది. ఇక పాక్ కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతుండూ వేచి చూడాలి.