అభినందన్ ని లాహోర్ కు తరలిస్తున్న పాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత వైమానికి దళం కమాండర్ అభినందన్ మిగ్ యుద్ధ విమానం నడుపుతూ పాకిస్తాన్ సరిహద్దులోకి దూసుకెళ్ళాడు అక్కడ విమానం లో ఫ్లక్చువేషన్స్ వల్ల విమానం కూలీ పాక్ భూబాగంలో ఆయన పడిపోయాడు. మునుపు ఆయనని చిత్రా హింసలకి గురి చేస్తూ పాక్ ఆర్మీ ఆయన వీడియో ని విడుదల చేసింది. అభినందన్ తమ చెర లో ఉన్నట్టు పాక్ వెల్లడించింది దీన్ని దృవీకరించిన భారత్ అభినందన్ ని వెనక్కి తేడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది.

ప్రయత్నాలు ఫలించి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ ని విడుదల చేస్తానని నిన్న ప్రకటన జారీ చేశాడు. అయితే ఇవాళ మద్యాన్నం 2 గంటల ప్రాంతానికి అభినందన్ భరాతా మాత ని తాకాబోతున్నాడు. మన ముద్దుబిడ్డ రాక కి స్వాగతం పలుకడానికి అశేష జనం వాఘా బార్డర్ కి చేరుకుంది అభినందన్ రాకకై వేచి చూస్తుంది. పెద్ద మొత్తం లో మీడియా మిత్రులు అక్కడకి చేరుకున్నారు. ఈ విషయమై పాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్లామాబాద్ లో ఉన్న ఆయన్ను, విమానంలో లాహోర్ కు తరలించేందుకు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘా బార్డర్ కు ఆయన్ను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి భారత వాయుసేనకు అప్పగించబోతుంది..!

Share.

Comments are closed.

%d bloggers like this: