రాజకీయలకి మురళి మోహన్ బాయ్ బాయ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు నటుడు రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ చంద్రబాబుకి చేయి ఇచ్చే దిశలో కనిపిస్తున్నాడు. ఇకపై రాజకీయాలకి సెలవు చెప్పే దిశ లో ఉన్నారని సమాచారం. పోయిన ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచినప్పటికి ఈసారి ఎన్నికలకీ ఆయన పోటీకి సిద్ధంగా లేరు అనే వార్తలు వినిపిస్తూన్నాయి. గత కొంత కాలంగా మురళి మోహన్ పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తన స్థానంలో తన కోడలు పోటీకి దిగుతున్నారని వార్తలు వినపడ్డాయి.

శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్‌, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్న మురళీ మోహన్ తాను గానీ, తన కోడలు గానీ పోటీకి సిద్ధంగా లేమని వారి స్థానం లో మరొక్కరినీ నియమించాలంటూ చంద్రబాబుకి వివరించనున్నారు. ఇక పై రాజకీయ వేదిక పై కాకుండా తన ట్రస్ట్ ద్వారా ప్రజలకి సేవ చేయాలని మురలి మోహన్ భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: