కట్టుకున్న వాడే కాలయమునిగా మారాడు.. మూడుముళ్లు వేసి ఎడడుగులు నడిచిన భార్య అన్న కనికరం చూపక కాలాయమునిగా మారాడు …గొంతు నులిమి హత్య చేసి ఆపై దోపిడీ దొంగల పని అని పోలీసులను బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు ఓ దుర్మార్గుడు…
ఈ ఘటన కర్నూలు జిల్లా సంజామాల మండలం ముదిగేడు గ్రామంలో చోటు చేసుకుంది. సోముల హర్షవర్ధన్ రెడ్డి..సువర్ణ లు బార్య భర్తలు తమకు ఉన్న 14 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు లోనైన హర్షవర్ధన్ క్రికెట్ బెట్టింగ్ లోకి దిగాడు .. దీంతో పెద్ద మొత్తం లో డబ్బు పోగొట్టుకున్నడు.
దీంతో తరుచూ భార్యను డబ్బు కోసం వేధించేవాడు..పెళ్లి సమయం లో కట్నం కింద అత్త మామలు పెట్టిన 8 లక్షలు నగదు 16 తులాల బంగారంను బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు.. ఆపై భార్యను తరుచూ డబ్బు కోసం వేధించేవాడు ఈ క్రమంలో నే బార్య వద్ద వున్న బంగారం తో పాటు పుట్టింటినుండి డబ్బు తెమ్మని హింసించేవాడు… ఈ కోవలోనే గురువారం భార్య సువర్ణను హత్య చేయాలని పథకం వేసిన హర్షవర్ధన్ తలకు మాస్క్ ధరించి బార్య ను గొంతు నులిమి హత్యచేసే ప్రయత్నం చేశాడు, అంతటితో ఉరుకోక నోటిలో క్రిమి సంహారక మందు వేశాడు .. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే ఇది దోపిడీ దొంగాల పనే నంటు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు… కోవెలకుంట్ల ఆసుపత్రి కి తరలించాడు ఆసుపత్రికి చేరుకునే లోగా ఆమె మృతి చెందింది..
సంజామల పోలీసులు అన్నికోనాల్లో దర్యాప్తు చేసి భర్తే భార్యను హత్య చేశాడని నిర్ధారణకు వచ్చి తమ దైన స్టైల్లో విచారించగా భర్త హర్షవర్ధన్ నే నేరం చేసినట్టు అంగీకరించారు. మృతురాలు తల్లి తండ్రి పిర్యాదు మేరకు భర్త అత్త మామలపై అదనపు కట్నం కోసం వేదించి హత్య చేసినట్లు కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డి ఎస్ పి తిప్పేస్వామి మీడియాకు తెలిపారు.