హైదరాబాద్ లో నూతన ఎన్‌ఐ‌ఏ కార్యలయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయం ప్రారంభమైంది. 2016 న శంకుస్తాపం జరిగిన ఈ కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. ఈ నూతన కార్యాలయానికి 45 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాలు ఈ ఎన్‌ఐఏ ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎన్‌ఐఏ డీజీ వైసీ మోదీ, ఐజీ అలోక్‌ మిత్తల్‌ పాల్గొన్నారు.

అనంతరం, రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఎన్ఐఏ సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పారు. ఎన్ఐఏ దర్యాప్తు చేసిన 92 కేసుల్లో ఉగ్రవాదులకు శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని అన్నారు. ఐసిస్, ఐఎస్ఐ పై రీసెర్చ్ సెల్ ఏర్పాటు చేయాలని అభిప్రాయడపడ్డారు. కొన్ని గంటల్లో అభినందన్ భారత్ కు పాక్ ఆర్మీ అప్పగించనుందని చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: