‘లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్’ కి అడుగడుగునా చిక్కులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బయోపిక్ లే ట్రెండింగ్ సబ్జెక్ట్. ఒక్క నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా దాదాపుగా 4 సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రతీ ఒక్కరూ వారి రీతిలో వారికి నచ్చినట్టుగా సినిమాని కథని మార్చుకుంటున్నారు. ఈ సినిమాలో ఎవరు హీరోనో ఎవరు విలనో అర్ధం కానీ పరిస్థితి.. ఎవరి సినిమా కరెక్టో ఎవరి సినిమా నమ్మాలో జనానికి అర్ధం కావట్లేదు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ఇప్పుడు సోషల్ మీడియా లో కలకలం రేపుతుంది. ఈ సినిమాలో వెన్నుపోటు అనేదే సబ్జెక్ట్ అని ఆర్‌జి‌వి అంటున్నారు. సినిమా ట్రైలర్ లో కూడా వెన్నుపోటు అనే అంశాన్ని చూపించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తీశాడు వర్మ.

అయితే ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఈ సినిమాని అడ్డుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అని ప్రచారం కూడా లేకపోలేదు. మునుపు సెన్సార్ బోర్డ్ అనే అస్త్రం వాడి ఇప్పుడు అధికారం అనే అస్త్రాన్ని వాదోబోతున్నారు అని అంటున్నాయి తెలుగు చిత్రసీమ వర్గాలు. ఎలా ఐనా చేసి ఈ సినిమాని ఆడనివ్వకుండా చేస్తాడు అని ఆర్‌జి‌వి అభిమానులు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఆర్‌జి‌వి అభిమానుల్లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఎక్కువైపోతున్నాయి. ట్రెయిలర్ మరియు పాటలు అభిమానులని అలరిస్తున్నాయి. పైగా ఈ మధ్య వచ్చిన ఎన్‌టి‌ఆర్ బయోపిక్ లు ఫ్లాప్ అవ్వడం తో ఆ ఫ్లాప్స్ ని మాత్రం ప్లస్ పాయింట్ అని ఆర్‌జి‌వి అభిమానులు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: