రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు సేకరించిన అనంతరం రాజేందర్ నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. నిమ్స్ ని సందర్శించిన ఆయన అక్కడ రోగులతో యాజమాన్యంతో కొంత సేపు మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి కొన్ని హామీలు ఇచ్చారు.
ఈ సంధర్భంగా ఆయన మెడియ తో మాట్లాడుతూ.. ‘నిమ్స్ హాస్పిటల్ లో ప్రజలకు మెరుగయిన వైద్యం అందుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా రానిస్తుంది అని ఆయన అన్నారు. దాదాపు 3 వెల మంది ఇన్ పేషేంట్స్ వస్తున్నారు అంటే రావాల్సిన సంఖ్య కన్నా డబుల్ వస్తున్నారు అని ఆయన అన్నారు.
నిమ్స్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ఇప్పిస్తాము అని ముఖ్యమంత్రి చెప్పారు… వీరి సమస్యలు అడిగి స్వయంగా తెలుసుకున్నాము త్వరలోనే తిరుస్తాము. పాత బిల్డింగ్ రేనవేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరో 1000 బెడ్ లు పెంచేలా చర్యలు తీసుకుంటాము. సిబ్బంది పెరగాల్సిన అవసరం ఉంది. పేషేంట్ ల డిమాండ్ లకు అనుకూలంగా బెడ్ లని పెంచాలనుకుంటున్నాము. రోగుల అటెండెన్స్ కోసము ఆగిన నిర్మణాలు పూర్తిచేస్తాము. ఔట్ సోర్సింగ్.. కాంట్రక్టు ఉద్యొగులకు జీతము టైం కి వచ్చేలా చూస్తాము.. ఆరోగ్య శ్రీ లో మరిన్ని మార్పులు తెస్తాము అని ఆయన బదులిచ్చారు.