వేదన.. అత్యాచారం..ఎముకలు వీరిగాయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆడవారి పై అత్యాచారాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అత్యాచారం జరుగుతూనే ఉంది. చట్టం పోలీసులు ఎంత ప్రయత్నించిన ఈ అత్యాచారాల్ని అరికట్టలేకపోతున్నారు. ఈ అత్యాచారాలకి హద్దు అదుపు.. వయసు వరుస.. ఉండకుండా పోతుంది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూర్ లో ఒక పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పై స్కూల్ హాస్టల్ రూమ్ లోనే అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఎవరికయినా చెబితే చంపేస్తామని ఫేయిల్ చేస్తామని బెదిరించారు. దిక్కు తోచని స్థితిలో అమ్మాయి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడింది. అదృష్టవాశాత్తు బాలిక ప్రాణాలతో బయటపడింది.

వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం.. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శివారు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని స్కూల్ పైనున్న హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అదే పాఠశాలలో గతంలో చదువుకున్న ఓ విద్యార్థి ఆమెపై కన్నేశాడు. బాలిక హాస్టల్‌లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన అతడు మరో విద్యార్థి సాయంతో హాస్టల్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు వెళ్లిపోయారు.

ఈ అఘాయిత్యం గురించి బాలిక స్కూల్ యాజమాన్యానికి చెబితే వారు పట్టించుకోకుండా తిరిగి బాలికనే బెదిరించారు ఎవరికైనా చెబితే ఫెయిల్ చేస్తామని బాలికను బెదిరించారు. దిక్కు తోచని స్థితి లో ఆ బాలిక పాటశాల పై అంతస్తు నుంచి దుకేసింది. దీంతో ఆ బాలిక రెండు కాలు వీరిగాయి. గుట్టు చప్పుడు చేయకుండా స్కూల్ యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇక బాలిక తల్లిదండ్రులకి ఫోన్ చేయగా వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరిపోయారు. అసలేం జరిగిందని తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా ఈ విషయం బయటపెట్టింది. బోరున విలపించింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకి వివరించి కేసు నమోదు చేయించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: