సూపర్ స్టార్ పాటకి సూపర్ ఖర్చు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశల్లో ఉంది. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించబోతుంది. కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ వ్యవరిస్తున్నారు. మహేశ్ బాబు మంచి ఊపు మీద ఉండటం చూసి ఈ సినిమా పై మహేశ్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. పైగా ఖర్చు పెట్టడానికి వెనక్కి తగ్గని నిర్మాతలు ఉండటం వల్ల ఈ సినిమాకి మంచి హిట్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.

అయితే దేవి ఈ సినిమాకి ఒక అద్భుతమైన టైటిల్ సాంగ్ ని కంపోస్ చేస్తున్నాడు. ఈ పాట దర్శకుడికి ఎంతగానో నచ్చిందట అయితే ఈ పాటని వంశీ చాలా ఇంట్రెస్టింగ్ గా తెరక్కెకించాలి నిశ్చయించుకున్నాడు. దీనికోసం ప్రొడ్యూసర్ దిల్ రాజు ని కోరగా దిల్ రాజు ఏకంగా 2 కోట్ల వరకు కార్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడట. మహేశ్ సినిమాల్లో టైటిల్ సాంగ్స్ చాలా ఫేమస్ అయితే ఇంత భారీగా తెరకెక్కిస్తున్న ఈ పాట ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: