అమరుల లిస్ట్ లో మరో నలుగురు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశమంతా వింగ్ కమాండర్ అభినందన్ రాకకై వేచి చూస్తుంది. వింగ్ కమాండర్ రాక వల్ల దేశం లో పండగ వాతావరణం నెలకొంది. ఒక పక్క దేశ ప్రజలంతా అభినందన్ రాక పట్ల సంతోషంగా ఉంటే కాశ్మీర్ లో మాత్రం విషాద చాయలు అలుముకున్నాయి. కాశ్మీర్ లో భారత ఆర్మీ ఉగ్రవాదుల నిర్మూలనకై ప్రతీ ఇంటిని సోదాలు చేస్తున్న నేపధ్యంలో హంద్వారాలోని బాబుగుండ్ లాంగేట్ ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. ఓ ఇంట్లో ఇద్దరు టెర్రరిస్టులు తలదాచుకోవడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పలు జరిపాయి.

కుప్వారా జిల్లా హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బద్రతా సిబ్భందే ముఖ్య లక్ష్యంగా తీవ్రవాదులు కాల్పులు జరపగా 9 మంది సీఆర్‌పీఎఫ్ అధికారులతో పాటు మరో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. . ఎన్‌కౌంటర్ అనంతరం హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బందే లక్ష్యంగా స్థానికులు రాళ్లు రువ్వారు. దాంతో ఆత్మరక్షణ కోసం పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారు జవాన్లు. ఇరువర్గాల ఘర్షణలో ఐదుమంది యువకులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా హంద్వారాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

అయితే గాయపడ్డ అధికారుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ అధికారి ఒక పోలీస్ అక్కడికక్కడే చనిపోవగా. మిగితవారిని ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా మరో ఇద్దరు అధికారులు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఉగ్ర నిర్మూలనలో భారత్ ఇప్పటికే చాలా మంది అధికారులని కోల్పోయింది. నేటితో ఆ లిస్టులో మరో నలుగురు అమరులయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: