అభినందన్ కు అనేక పరీక్షలు – ఐ‌బీ

Google+ Pinterest LinkedIn Tumblr +

పాకిస్తాన్ యుద్ద విమానాలు ద్వంశం చేసే దిశలో పాకిస్తాన్ సరిహద్దులోకి వెళ్ళి మరీ వల్ల విమానాల్లో ఒకదాన్ని కూల్చి వారి భూగర్భం లో పడిపోయాడు భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్. మిగ్ విమానం కూలడం వల్ల వారి సరిహద్దులోకి దూకి పరాషూట్ వేసుకొని ప్రణాలు రక్షించుకున్నాడు. ఇక దొరికిందే అవకాశం గా వాడుకునే పాకిస్తాన్ అభినందన్ ను బందీ గా చేసుకొని వారి చెర లో ఉంచారు పాకిస్తానీ ఆర్మీ..

అభినందన్ ని వెనక్కి తేడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది భారత ప్రభుత్వం. మన ప్రయత్నాలు ఫలించి నిన్న అభినందన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి పంపింది. వాఘా బార్డర్ లోకి అభినందన్ ని విడిచి పెట్టింది. అభినందన్ రాకకై వేలాది జనం ప్రభుత్వ నేతలు మెడియ మిత్రులు అక్కడికి చేరారు, అభినందన్ కి ఘన స్వాగతం పలికారు.

కాగా మూడు రోజుల పాటు బందీ గా ఉన్న అభినందన్ ద్వారా జాతీయభద్రత, దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలున్న నేపథ్యంలో అనేక పరీక్షలు నిర్వహిస్తామని సైన్యం చెబుతోంది. పాక్‌‌లో బందీగా గడిపిన సమయంలో ఆయన్నుంచి దేశ రహస్యాలేమైనా శత్రుదేశం తెలుసుకుందా?, తనకు తెలియని స్థితిలో అభినందన్‌ చెప్పకూడని విషయాలేమైనా చెప్పేశారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆయనకు ఐదు రకాల పరీక్షలు చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి సైన్యాధికారికి ఈ పరీక్షలు తప్పనిసరి అధికారులు పేర్కొన్నారు.

తను ఫిట్ గా ఉన్నారా అనే విషయం పై పరీక్షలు నిర్వహించనుంది. తన పై పాకిస్తానీ ప్రభుత్వం ఏమైనా ఔషదాలు ప్రయోగించిందా అనే పరీక్షలు చేయనుంది. తన వంట్లో ఏదైనా చిప్ ని అమర్చార అని స్కాన్ చేయనుంది. ఇంటెలిజెంట్ బ్యూరో ఆయనని అనేక ప్రశ్నలు అడగనుందని సమాచారం.

కాగా ఆయనని అప్పగించినపుడు అభినందన్ డార్క్ బ్లూ బ్లేజర్, గ్రే పాంట్స్ ధరించి ఎంతో హుందాగా కనిపించాడు. అనంతరం తమ పైలట్ ను సాదరంగా తోడ్కొని వెళ్లారు భారత వాయుసేన అధికారులు. ఈ సందర్భంగ అభినందన్ తన స్పందన తెలియజేస్తూ… ‘ఇటీజ్ గుడ్ టు బీ బ్యాక్’ తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: