దిగజారే బీజేపీ..! అవినీతే వై‌సీపీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్..

అభినందన్ దేశభక్తికి దేశం అంతా సంఘీభావం.. బిజెపి నమ్మకద్రోహంపై రాష్ట్రం అంతా నిరసనలు.. దేశంలో ఏ ప్రధానికి ఇంత నిరసనలు లేవు.. గతంలో ఏ ప్రధానికి ఇన్ని నల్లజెండాలు లేవు.. విఫల ప్రధానిగా నరేంద్రమోది మారారు.. అభినందన్ వచ్చే రోజు ప్రధాని ఢిల్లీలో ఉంటారు.. లేదా సరిహద్దుల్లో అభినందన్ కు స్వాగతం పలకాలి.. అలాంటిది విశాఖ వచ్చింది టిడిపిని తిట్టడానికేనా..? అభినందన్ కు స్వాగతం మీకు ముఖ్యం కాదు.. మోదీ కి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువ.. దేశ భద్రత కన్నా రాజకీయ భద్రతే మోదికి ముఖ్యం.. రాజకీయం కోసం దేనికైనా దిగజారే పార్టీ బిజెపి.. ఎన్నికల్లో లబ్ది కోసం ఎంతకైనా దిగజారే పార్టీ బిజెపి.. స్వార్ధం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసిపి..

5 ఏళ్లయినా జగన్మోహన్ రెడ్డి అవినీతిపై చర్యలేవి..? అవినీతిపరులతో బిజెపి నేతలు అంటకాగుతున్నారు.. కుటుంబమే లేని మోది నా కుటుంబాన్ని నిందిస్తున్నారు.. వైసిపికి మేలు చేసేందుకే టిడిపిపై విమర్శలు.. భార్య బిజెపిలో, భర్త వైసిపిలో, కొడుకు వైసిపిలో.. బిజెపి, వైసిపి లాలూచికి ఇంతకన్నా రుజువు కావాలా..?

ఓట్లు తొలగించే కుట్రలు.. మొన్న పొన్నూరులో,నిన్న నర్సీపట్నంలో,ఈరోజు పాతపట్నంలో ఓట్ల తొలగింపు.. ఓట్ల తొలగింపు కుట్రలు చేసిన ఎవరినీ వదలొద్దు.. వైసిపి ఓట్ల తొలగింపు కుట్రలను ఎదుర్కోవాలి.. ప్రజల ముందు వైసిపిని నేరస్తులుగా నిలబెట్టాలి.. నేరస్తుల కూటమి మనపై కుట్రలు చేస్తోంది.. స్వార్ధం కోసం రాజకీయం దుర్మార్గం,ఈ ఎన్నికల్లో నేరగాళ్లతో మన పోరాటం..

పనికిమాలిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. నమ్మకద్రోహం చేసిన పార్టీ బిజెపి.. నిజాయితీపరులంతా టిడిపిలో చేరుతున్నారు.. దశాబ్దాల వైరం వీడి టిడిపికి సంఘీభావం.. కర్నూలులో కోట్ల, కెఈ కుటుంబాలే రుజువు.. విజయనగరంలో బొబ్బిలి, గజపతి రాజులే సాక్ష్యం.. కురుపాంలో వైరం వీడి టిడిపితో ఏకం అయ్యారు.. కడపలో వర్గాలన్నీ ఏకమై టిడిపితో కలిశారు.. ఇదే స్ఫూర్తి రాష్ట్రం అంతా రావాలి.. వర్గాలకు అతీతంగా టిడిపికి మద్దతు ఇవ్వాలి.. రాష్ట్రం కోసం తెలుగుదేశంతో కలిసి నడవాలి. అని ఆయన టెలీకన్ఫరెన్స్ లో అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: