పాక్ నోట పవన్ యడ్యూరప్పల మాట-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత పాక్ యుద్ధం గురించి తనకి రెండు సంవత్సరాలకి ముందే తెలుసని తనకి ఒక బిజెపి సీనియర్ నేత చెప్పాడని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం లో తీవ్ర చర్చనీయాంశం గా మారింది. తనకి చెప్పిన ఆ బిజెపి నేత ఎవరంటూ పవన్ పై ప్రశ్నలు రేకెత్తాయి.

ఇదే తరహాలో ఇక బిజెపి సేనియర్ నేత కర్నాటక ప్రతిపక్ష నాయకుడు యడ్యూరప్ప అయితే.. పాక్ స్థావరాలపై భారత్ దాడి.. తమకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందంటూ కామెంట్స్ చేశారు. ఈ ఎఫెక్ట్ తో కర్ణాటకలో 20 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి దక్కుతాయని అభిప్రాయపడ్డారు. ఇక ఈయన వ్యాఖ్యాలైతే చెప్పనక్కర్లేదు నిన్న ఎటు చూసిన ఈయన పై వ్యంగ్యాస్త్రాలే వెల్లువయ్యాయి.
వీరు ఇద్దరు ఇలా కామెంట్ చేసేసరికి ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. వీరి వ్యాఖ్యలను వాడుతూ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేతలు బి‌జే‌పి పై మండిపడ్డారు.

ఇక మన దేశం సంగతి ఇలా ఉంటే ఈ వ్యాఖ్యలని ఉద్దేశిస్తూ పాక్ ప్రధాని పార్లమెంట్ లో ప్రస్తావించారు భారత్ పై భారత ప్రధాని పై వ్యంగ్యస్త్రాలు విసిరారు ఇమ్రాన్ ఖాన్. ఈ విషయాలని ముఖ్యంగా యడ్యూరప్ప వ్యాఖ్యాలను గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ పై నేడు జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: