తెరాస ని ఉతికి ఆరేసిన జగ్గారెడ్డి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలం గా తెరాస పార్టీ హరీష్ రావు కి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గ రెడ్డి కి మాటల యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఒకరి పై ఒకరు పర్స్నల్ గా విమర్శలు చేసుకుంటున్నారు. జగ్గ రెడ్డి జయలుకి వెళ్లొచ్చిన నాటి నుండి హరీష్ రావు పై మండి పడున్నారు. తనని జయలుకి పంపడం లో కూడా హరీష్ హస్తం ఉందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. వ్యంగ్య పరుస్తూ మాట్లాడారు.. మిషన్ భగీరథ పనులు చేస్తున్నది హరీష్ అని నేను అనుకున్న.. సింగూరు నీళ్ళను హరీష్ తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్ ఏం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నించాడు. ఆ నీటిని హరీషే తరలించారని నేను అనుకున్న కానీ కేటీఆర్, కవిత, వినోద్, ఈటెల కూడా ఇందులో ఉన్నారని టీఆరెస్ నేతలు అంటున్నారు, దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి అని ఆయన వారిని ప్రశ్నించారు.

మా నియోజకవర్గం సంగారెడ్డి లో తాగడానికి నీళ్ళు లేవు ముందు దాన్ని పరిష్కరించండి. వల్ల సమస్య తీర్చండి అప్పుడు మాట్లాడుకుందాము రాజకీయాలని అంటూ ద్వాజమెత్తారు. నీళ్ల పంచాయితీ ఒడిసిన తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం..నేను మాట్లాడేందుకు రెడీ అంటూ ఆయన మండి పడ్డారు. ప్రజా సమస్యలు మాట్లాడితే పర్స్నల్ గా టార్గెట్ చేస్తున్నారు. పోలీసు జులుము వాడి అణిచివేయాలని చూస్తున్నారు. నలబై ఏళ్ల కింద నేనెంతో డాక్యుమేనటరి తీసి చూపించండి. నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నా కథ మీరు రాస్తారా మీ నిజాలు నేను బయట పెట్టాలా అంటూ తెరాస నాయకులు కే‌టి‌ఆర్ హరీష్ కేసీఆర్ ల పై జగ్గారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: