రాహుల్ తో డేట్ కి వెళ్తా..కరీనా!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ నటి బెబో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరీనా కపూర్ ఏ‌ఐసిత‌సి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్ మెడియ లో సినీ వార్తల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వ్యాఖ్యాలెంతో తెలుసుకోవలనుందా..? కరీనా కి రాహుల్ టో డేట్ కి వెళ్లాలనుందట..!

బాలీవుడ్ స్టార్ నటి కరీనా సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి తరువాత కూడా అదే గ్లామర్ కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా కరీనా సిమీ గ‌రేవాల్ నిర్వాహించిన ఓ ఇంట‌ర్వ్యూలో కరీనా పాల్గొంది. ఈ ఇంటెర్వ్యూ లో సిమీ అడిగిన ప్రశ్నకి కరీనా అబ్బురపరిచే జవాబు చెప్పింది.

సీమీ కరీనా ని మీకు ఎవరితో డేటింగ్ చేయాలనుండి అని అడిగిన ప్రశ్నకి కరీనా వెంటనే ఆలోచించకుండా రాహుల్ గాంధీ అని సమాధానం ఇచ్చింది. `మీరు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ స‌మాధానం చెప్పొచ్చో, చెప్ప‌కూడ‌దో తెలియదు. అయినా చెబుతాను. నా స‌మాధానం వివాదాస్ప‌దం అవుతుందేమో. నేను రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నాను. అత‌ని గురించి పూర్తిగా తెలుసుకోవాల‌ని ఉంది. మేగ‌జీన్‌లో అత‌ని ఫోటోలు చూస్తున్న‌ప్పుడు అనిపిస్తుంటుంది.. అత‌డితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని. నేను పూర్తిగా సినిమాలకు అంకిత‌మైన కుటుంబం నుంచి వ‌చ్చాను. అయ‌న పూర్తి రాజ‌కీయ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. కాబట్టి మా మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా ఉంటుందేమోన‌`ని క‌రీనా చెప్పింది.

Share.

Comments are closed.

%d bloggers like this: