10ఏళ్ల చిన్నారిపై…రోజుకు 100మంది వరుసగా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

అమ్మ ఒడిలో ఆడుతూ..పడుతూ..అల్లారుముద్దుగా పెరగాల్సిన అభం శుభం తెలియని ఆ 10ఏళ్ల చిన్నారి పశువులకంటే హీనంగా ప్రవర్తించే కామాంధుల కాటుకు బలై తానే ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఇరాక్ లో జరిగిన ఓ దారుణ ఘటన యావత్తు ప్రపంచాన్నే సిగ్గుపడేలా చేస్తుంది.

ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు యాజిది తెగకు చెందిన పురుషులను మూకుమ్మడిగా చంపేసి. మహిళలను ఎత్తుకెళ్లి, వారిని వయసుల వారీగా విభజించి మరీ సెక్స్ బానిసలుగా మార్చేసారు. 10-20 నుంచి ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలతో సీనియర్ జిహాదీలు బలవంతంగా శృంగారంలో పాల్గొని అనంతరం వారిని మరొకరికి విక్రయించేవారు. ఇందులో ఇరాక్‌కు చెందిన మార్వా ఖేదర్ అనే పదేళ్ల చిన్నారి ఉగ్రవాదుల కామవాంఛకు బలైంది. అంత చిన్న వయస్సులోనే గర్భం దాల్చింది. ఒక స్నేహితురాలు ద్వారా విషయం ఆ చిన్నారి మేనత్తకు తెలిసింది.

పదేళ్ల వయసున్న అనేక మంది చిన్నారులను కనీసం వందకు మంది పైగా రేప్ చేసేవారు. ఫలితంగా వారు గర్భం దాల్చేవారని ఐసిస్ నుండి పారిపోయి వచ్చిన వారు చెప్పేవారని జియాద్ అవదల్ తెలిపారు. ఆయన గతంలో టీచర్‌గా పని చేసారు. ఐసిస్ నుండి పారిపోయి వచ్చిన యాజిదిలకు ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే మార్వా ఖేదర్‌ అత్తయిన మహద్య కూడా ఐసిస్ బాధితురాలే కావడం గమనార్హం. ఆమెకు 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. వీరందరినీ కిడ్నాప్ చేసి, ఆమెను కూడా బానిసగా మార్చేసారు. అడ్డు తిరిగితే ఆమె పిల్లలను పెళ్లి చేసుకుంటామని చెప్పి మరీ ఆమెను అన్ని విధాలుగా లొంగదీసుకున్నారని, అంతేకాకుండా తనను ఎంతో మందికి విక్రయించడం వల్ల ఎన్నిసార్లు అమ్ముడుపోయిందో తనకే తెలియదంటూ వాపోయింది. ఎట్టకేలకు ఆమె ఫిబ్రవరి మొదటి వారంలో ఐసిస్ చెర నుండి తప్పించుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: