తల్లిదండ్రులని తగలబెట్టిన కిరాతక కొడుకు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య వైరం చూసాము. ఇరుగుపొరుగు వారి మధ్య తగాదాలు చూసాము. కొన్ని సన్నివేశాల్లో గొడవలు ఆపై కొట్టుకోవడం ఇక పోతే చంపుకోవడం ఇలాంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే చంపడం కనీ వినీ ఎరుగి ఉండము. ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటు కేసుకుంది. మధుసూదన్ రెడ్డి అనే ఒక కిరాతక కొడుకు తన తల్లిదండ్రులు ఆస్తి పంచట్లేదాని తనని కన్న వారు అని కూడా లెక్క చేయకుండా వారి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులని చంపిన కొడుకుగా ఘోరాల చరిత్రకి ఎక్కాడు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం కానే లోని మధుసూదన్ రెడ్డికి ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రులతో ఈరోజు గొడవ జరిగింది. దీంతో రెచ్చిపోయిన మధుసూదన్ రెడ్డి తల్లి నర్సమ్మ, తండ్రి నారాయణరెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు నర్సమ్మ అప్పటికే చనిపోయినట్లు తేల్చారు.

ఇక నారాయణరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మరింత మెరుగైన చికిత్స కోసం బళ్లారి నిమ్స్ కు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నారాయణరెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మధుసూదన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: