వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిది సుష్మసాయి నగర్ లో 5 అంతస్థుల భవనం పై నుండి దూకి నవ వధువు నివేధిత (29) ఆత్మహత్య కి పాల్పడింది. భర్త మరియు అత్త మామల వేధింపులే కారణమని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు మృతురాలి తల్లిదండ్రులు.
వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ కి చెందిన పృధ్విరాజ్, సుజాత ల కూతురు నివేదిత కి గత సంవత్సరం జులై 1 న వనస్థలిపురం సుష్మా సాయి నగర్ కి చెందిన సాఫ్టువేర్ ఉద్యోగి రఘు ప్రకాష్ తో వివాహం జరిగింది. గత నాలుగు నెలల నుండి భర్త, అత్త నిమ్మిరాని మామా జ్ఞాన ప్రకాష్ లు కట్నం విషయంలో నివేధిత ని వేధిస్తున్నారు.
కట్నం తక్కవగా తీసుకుని వచ్చావని వేదిస్తుండటంతో నిన్న రాత్రి అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి సర్ది చెప్పి ఉదయం వెళ్లిపోయారు అనంతరం మనస్తాపం చెందిన నివేదిత 5 అంతస్థుల భవనం పైకి ఎక్కి దూకటం తో అక్కడిక్కడే మృతిచెందింది.
అప్పటికే వివాహ సమయంలో 45 తులాల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి కట్నంగా ఇచ్చినట్లు మృతురాలు తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త మరియు అత్తమామలని అదుపులోకి తీసుకున్నారు ఆత్మహత్యకు సంబందించిన సిసి కెమెరాల దృశ్యాలు తీసుకున్న అనంతరం విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని వనస్థలిపురం సిఐ మీడియాకి తెలిపారు…