27 బంతుల్లో 14 బౌండరీలు-సుడి-గేల్

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ తో తగాదాలు ఉన్నాయని టీం కి దూరంగా ఉన్నాడు విండీస్ విద్వాంసకర ఆటగాడు గేల్. ఆరు నెలల తరువాత మళ్ళీ టిమ్ లోకి అడుగు పెట్టాడు ఈ 39 ఏళ్ల స్టార్ ఆటగాడు. గేల్ కి విండీస్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన ఆట శైలి తన విద్వాంసకర బ్యాటింగ్ తో భారీ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గేల్ గ్రీస్ లో పది నిమిషాలు ఉన్నాడంటే చాలు ఇక సిక్సర్ల వర్షం కురిసినట్టే. బౌలర్లు ఎన్ని రకాలుగా బంతి వేసినా గేల్ తాకిడిని మాత్రం ఆపలేరు.

ఇదే రీతిని గేల్ టీమ్ లోకి వచ్చినప్పటినుండి కనభరుస్తున్నాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన జనాన్ని తన ఆట తో అలరిస్తున్నాడు. ఇక సిక్సర్లు బాదటం లో గేల్ దిట్ట అనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్నా విండీస్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో విండీస్ టీమ్ చక్కటి ప్రతిభ ను చూపిస్తుంది. గత కొంత కాలంగా కేవలం ఓటమి తప్ప ఇంకేమీ తెలియనట్టుగా వ్యవహరించిన విండీస్ ఇప్పుడు ఇంగ్లాండ్ ని మాత్రం చితకబాదుతుంది. ముప్పుతిప్పలు పెడుతుంది. ఒక దశలో సిరీస్ విండీస్ దే నేమో అన్నట్టుగా అనిపించింది. కానీ మూడవ మ్యాచ్ రద్దు అవ్వడం తో ఆ పరిస్థితిని చేజార్చుకుంది. ఇక గేల్ అయితే చెప్పక్కర్లేదు. తాజాగా 175 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా అదే రీతి లో ఆడాడు గేల్ కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించి వెస్టిండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయ్యింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో వన్డేలో విండీస్‌ గెలుపొందింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ను విజయం వరించింది. దాంతో ఐదో వన్డే విండీస్‌కు కీలకం మారింది. ఈ మ్యాచ్‌ను గెలిస్తేనే సిరీస్‌ను సమం చేసుకునే పరిస్థితుల్లో విండీస్‌ ఉండగా గేల్ బాదుడికి ఎట్టకేలకు సిరీస్ సమం అయ్యింది.

Share.

Comments are closed.

%d bloggers like this: