టీడీపీ లోకి ఎన్‌టి‌ఆర్ వస్తున్నారు..ఇక కాలం మాదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాబోయే కాలంలో తెలంగాణ టీడీపీ లోకి ఆ హీరో రానున్నారా..? తెద్లుగుదేశం పార్టీని తెలుగు హీరో ఆదుకోబోతున్నారా..? జూ ఎన్‌టి‌ఆర్ టీడీపీ ని తెలంగాణ లో నడపబోతున్నారా..? అనే ప్రశ్నలు ఇప్పుడూ అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రెండేళ్లలో టీడీపీని బతికించుకుంటాం. ఆ తర్వాత డైమండ్ లాంటి లీడర్ వస్తారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.’ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణ టీడీపీకి రాబోయే రెండేళ్లలో కొత్త నాయకత్వం వస్తుందని, జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపడతారని ఖమ్మం జిల్లా అశ్వారావు పేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మెచ్చా నాగేశ్వరరావు తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని చెప్పారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, సీఎంఓ సహా పెద్ద పెద్ద వాళ్లు తనను పార్టీ మారాలని కోరిన మాట నిజమేనన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలంగాణలో కేవలం టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే గెలిచారు. వారిలో సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: