గుంటూరు తూర్పు నుండి అలీ అరంగేట్రం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు పార్లమెంట్ టీడీపీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు గుంటూరు ఎంపీ..జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి రాజా, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర పేర్లు మాత్రమే ఖరారు చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 5 నియోజకవర్గాలు సమస్యగా మారాయి. అయితే గుంటూర్ తూర్పు నుండి చంద్రబాబు దాదాపుగా నటుడు ఆలిని పేరుని ఖారారు చేసినట్టే అని సమాచారం వస్తుంది.

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఆదివారం నాడు కసరత్తు నిర్వహించారు. సోమవారం నాడు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. గుంటూరు తూర్పు స్థానం నుండి సినీ నటుడు అలీ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.

గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సినీ నటుడు అలీ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. అలీ కాకపోతే షరీఫ్ పేరును పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూడ అలీని గుంటూరు సిటీలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని టీడీపీ ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాలతో అలీ అభ్యర్ధిత్వం ఖరారు కాలేదు. కొంత కాలంగా అలీ టీవి షోస్ లో కూడా తనకి గుంటూర్ నుండి పోటీ చేయాలనుంది అనటం అక్కడ తనకి మంచి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పడం తెలిసిందే. ఈ మేరకు ఊహించారేమో కానీ చంద్రబాబు అలీ పేరుని దాదాపుగా ఖారారు చేసినట్టే.

Share.

Comments are closed.

%d bloggers like this: