జైషే మహమ్మద్ అధినేత మృతి..! అనేక అనుమానాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ కన్ను మూశాడు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాద పడుతున్న ఈయన నిన్న సాయంత్రం మరణించినట్టుగా సమాచారం వస్తుంది. కొద్ది రోజులు క్రింద భారత్ కాశ్మీర్ లో జరిగిన పుల్వామ ఉగ్రదాడులు చేయించిన తీవ్రవాద సంస్థ అధినేత ఈయనే. అయితే రెండు రోజుల క్రితమే పాక్ మంత్రి ఒకరు మసూద్ అజహర్ పాక్ లోనే ఉన్నదంటూ పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ అతనితో టచ్ లో ఉన్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసినప్పుడు మసూద్ అజహర్ కిడ్నీ సమస్య తో బాదపడుతునట్టుగా కానీ అస్వస్థత కి గురయినట్టుగా కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. భారత ఇంటెలిజెన్స్ కూడా ఈ విషయమై ఎటువంటి ప్రకటన చేయలేదు.

సడన్ గా ఒక్కసారి ఈ వార్తా వచ్చేసరికి మన దేశం దీనిని నమ్మలేకపోతుంది. ఉన్నట్టుండి ఇలాంటి వార్త భారత్ అస్సలు ఊహించలేదు. కానీ ప్రముఖ నేషనల్ మెడియ కథనాల ప్రకారం జైషే మహమ్మద్ అధినేత మృతి చందారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మసూద్ అజహర్ ని ఎలాగైన పట్టుకోవాలన్నదే భారత ఆర్మీ ముఖ్య లక్ష్యం. అయితే హిట్ లిస్ట్ లో ఉన్నందున ఆయనని తప్పించడానికి పాక్ ప్రోత్సాహిస్తూ ఈ వార్తా ప్రచురితం చేస్తుంది అనే ప్రచారం కూడా లేకపోలేదు.

మసూద్ అజహర్ పై భారత్ కి ఎప్పటినుండో కన్ను ఉంది ఎందుకంటే భారత్ లో అనేక ఉగ్రదాడులకు అతనే కారకుడు. 1994లో పోర్చుగీస్ పాస్ పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు భారత్ భద్రత బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. ఆ తరువాత అనూహ్యంగా తప్పించుకున్నాడు. మొన్న జరిగిన పుల్వామ దాడులు చేసింది కూడా మేమే అంటూ అధికారిక ప్రకటన కూడా చేశాడు మసూద్. ఇలాంటి నేపధ్యం లో ఆయన మరణించాడు అనే వార్తలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: