రెండు రాష్ట్రాల నడుమ ఐటీ సెగ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత రెండు రోజుల నుండి హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఐటీ గ్రిడ్ కార్యాలంలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖిలలో భాగంగా తెలంగాణ పోలీసులు ఆంధ్రకి సంభంధించిన ఐటీ గ్రిడ్ కంపనీ హార్డ్ డిస్క్ లు స్వాదీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లు స్వాదీనం చేసుకోవడంతో అందులోని డేటా లీక్ అయినట్టుగా ఆంధ్రా పోలీసులు ఆరోపణలు వేస్తున్నారు. దీంతో ఈ వివాదం కలకలం రేపుతుంది.

టీడీపీకి చెందిన ఎన్నో యాప్స్‌కు ఐటీ గ్రిడ్ సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సేవామిత్ర, మహానాడుతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు డేటాతో కూడిన హార్డ్ డిస్క్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏపీకి చెందిన సమాచారం కావడంతో మీరెలా చూస్తారంటూ ఏపీ పోలీసులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసు తెలంగాణలో నమోదు కావడంతో పాటు తమ రాష్ట్ర సమాచారం కూడా చోరీకి గురైనట్లు తెలియడంతో దీన్ని తామే విచారణ చేయిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

ఇక పోతే తెలంగాణ పోలీసుల విచారణలో భాగంగా పోలీసులు హార్డ్ డిస్క్ లే కాకుండా పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ గ్రిడ్ కి చెందిన నలుగురు ఉద్యోగులని తమ కస్టడీ లో ఉంచారు. దీంతో తమ ఉద్యోగులలో భాస్కర్ కనపడటం లేదని ఐటీ గ్రిడ్ యాజమాన్యం గుంటూరు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆంధ్రా పోలీసులు రంగం లోకి దిగారు. హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ పోలీసులని అడగగా తమ కస్టడీ లో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు వారికి సమాధానం ఇచ్చారు. తమ కంపెనీ కావడంతో భాస్కర్ ని తమకే అప్పగించమని ఏపీ పోలీసులు కోరగా దానికి నిరాకరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: