తెలంగాణ ఐటీ పరువు దెబ్బ తీసుకున్నారు-లోకేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీకి సంబంధించి డేటా లీక్ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీకేజీ వెనుక ఎవరున్నారన్న దారిపై దర్యాప్తు చేస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక పోతే తెలంగాణ పోలీసుల విచారణలో భాగంగా పోలీసులు హార్డ్ డిస్క్ లే కాకుండా పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ గ్రిడ్ కి చెందిన నలుగురు ఉద్యోగులని తమ కస్టడీ లో ఉంచారు. దీంతో తమ ఉద్యోగులలో భాస్కర్ కనపడటం లేదని ఐటీ గ్రిడ్ యాజమాన్యం గుంటూరు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆంధ్రా పోలీసులు రంగం లోకి దిగారు. హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ పోలీసులని ఈ విషయమై అడగగా తమ కస్టడీ లోనే ఉన్నట్టు తెలంగాణ పోలీసులు వారికి తెలిపారు. ఐటీ గ్రిడ్స్ తమ కంపెనీ కావడంతో భాస్కర్ ని తమకే అప్పగించమని ఏపీ పోలీసులు కోరగా దానికి నిరాకరించారు.

ఈ వ్యవహారం ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా నారా లోకేష్ తెలంగాణ సర్కార్ పై జరుగుతున్నా పరిణామాలపై సప్న్దిస్తూ గుర్రు మంటున్నారు.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఆయన తెలంగాణ సి‌ఎం కేసీఆర్ పై విరుచుకపడ్డారు. ‘ప్రజా క్షేత్రం లో చంద్రబాబుని ఎదుర్కునే దమ్ము లేక ఇలా ఐటీ కంపెనీలపై దాడులకి పాల్పడుతున్నారు. అన్యాయంగా ఉద్యోగులని అరెస్ట్ చేస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ఇస్తా.. అంటుంటే ఇంకేదో ఇస్తారు అని అనుకున్నా కానీ ఇలా డేటా దొంగతనం చేసి మీ ఐటీ పరువు ప్రతిష్టలని దెబ్బతీసుకుంటారు అని అనుకోలేదు ఇలా చేసి మీ పరువు మీరే తీసుకున్నారు .. అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ ఐటీ శాఖ పై విరుచుకపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: