దొంగే.. దొంగ..! దొంగ..! అన్నట్టుంది-కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లో తాజాగా జరుగుతున్నా ఐటి గ్రిడ్ కలకలం పై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. కేస్ లు అలవాటు ఉన్న ఆ ముఖ్యమంత్రిని ఈ కేసు కూడా ఎదుర్కొమనండి అంటూ సవాల్ చేశారు.

ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీ చేస్తుందని హైదరాబాద్ నివాసి ఫిర్యాదు చేస్తే తెలంగాణ ప్రభుత్వం స్పందించదా ? ఏపీ పోలీసు లకు తెలంగాణలో ఏం పని..? ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్డంగా దొరికినపుడు చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు మిద్దెనెక్కి అరుస్తూంటారు. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడాలి..?

ప్రజల్లో పరపతి కోల్పోయానని చంద్రబాబు భయపడి మాట్లాడుతున్నారు. ఏపీలో బాబు చేసిందేమి లేదు.. చంద్రబాబు కు సిగ్గుండాలి .దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్ట ఉంది. విచారణ లో కడిగిన ముత్యాల్లా బయట పడండి .. చంద్రబాబు 18 కేసలలో స్టే లు తెచ్చుకున్నారు. ఈ కేసు లోనూ స్టే తెచుకోమనండి. ఎందుకు భయం..? అంటూ ఆయన చంద్రబాబు, లోకేష్ లపై ఫైర్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: