ఆంధ్ర రాష్ట్రాన్ని వీడని వలసలు.. నేటి తో మరొకరు టీడీపీ కి గుడ్ బై..! చంద్రబాబు కి రోజుకొకరు చొప్పున షాక్ ఇస్తున్నారు. మొన్న చరితా నేడు చల్లా రామకృష్ణారెడ్డి.. ఇలా రోజు ఒకరు టీడీపీ ని వీడుతున్నారు. ఎన్నికల డేట్ దేగ్గరికి వస్తున్న చంద్రబాబుని మాత్రం వలసలు వీడట్లేదు. అయితే చల్లా రామకృష్ణ రెడ్డి తన పార్టీ సభ్యత్వం, సివిల్ సప్లై కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. చల్లా త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు తన సన్నిహితులు చెబుతున్నారు.
రామకృష్ణ రెడ్డి కి కాంగ్రెస్ లీడర్ గా మంచి పేరు ఉంది తన నియోజకవర్గమే కాకుండా మరో రెండు మూడు నియోజకవర్గాలలో కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది. చల్లా కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పలుమార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు.. అక్కడ ఆయనకి ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. దీంతో చల్లాకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. ఇలా ఎన్ని పదవులు కట్టబెట్టినా చల్లా మాత్రం కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానం పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సరిగ్గా ఎన్నికలు దేగ్గర పడే పాటికి చల్లా టీడీపీ ని వీడటం టీడీపీ కి ఒక వంతు ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చల్లా నియోజకవర్గం బనగానపల్లి నుండి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వైపు పార్టీ మొగ్గు చూపుతుంది అనే అంశంతో ఆయన పార్టీని వీడి వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ సమాచారం.