మట్టి కలిసింది ఉగ్రవాదమా .? పర్యావరణమా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘సర్జికల్ స్ట్రైక్ 2’ ఈ పదం వినగానే అందరికీ గుర్తొచ్చేది భారత ఎయిర్ ఫోర్స్ పాక్ సరిహద్దుల్లోకి చొరబడి బాల్కోట్ లోని ఉగ్ర శిక్షణా శిబిరాలపై చేసిన దాడి. అయితే దాడి చేసిన మాట వాస్తవమే ఎందుకంటే ఆ దాడి విజువాల్స్ భారత ఎయిర్ ఫోర్స్, ప్రభుత్వం అధికారిక ప్రకటన.. ఈ రెండు భారత ప్రభుత్వం వెల్లడించడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ దాడి లో తీవ్రవాదులు మరణించార లేదా..? అన్న అంశం పై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం కానీ భారత ఎయిర్ ఫోర్స్ కానీ ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ దాదాపుగా 300 మంది వరకు మరణించి ఉంటారని సీనియర్ బీజేపీ నేతలు అమిత్ షా వంటివారు ఊహాగానాలు వేశారు. ఇక ఈ సంఖ్య అత్యున్నంగా షికార్లు చేసింది.

అయితే ఇప్పుడు ప్రముఖ కాంగ్రెస్ నేతలు నవజోత్ సింగ్ సిద్దూ కపిల్ సిబల్ వంటి వారు మాత్రం బీజేపీ పై విరుచుకపడుతున్నారు.. ఎందుకంటే

1) పాకిస్తాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం కూడా భారత్ తమ చెట్లను కూల్చివేసిందని ఆరోపణలు చేశారు. ఇది అంతర్జాతీయ పర్యావరణ నిబంధనలకు విరుద్దమని, దీనిపై ఐరాసకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

2) అంతర్జాతీయ మీడియ కూడా ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. మన నేతలు 300 మంది మరణించారు అంటుంటే మీడియా మాత్రం పర్యావరణం దాడి జరిగిందని చెప్పుకొస్తుంది.

ప్రముఖ నేతలు ఈ విషయమై భారత ప్రభుత్వం సమాదానం చెప్పాల్సింది గా మోదీ ని కోరుతున్నారు కొందరు లీడర్లయితే మోదీ కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇలా 300 మందిని మట్టి కల్పించామని చెబుతున్నాడు ఒకవేళ ఇదే నిజమైతే ఎయిర్ ఫోర్స్ కానీ మోదీ కానీ ఈ వుషయమై క్లారీటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: