అసలేంటీ ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్..? అసలు ఏం జరిగింది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్..! ఈ రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించాయనే ఆరోపణలపై ఈ రెండు సంస్థలపైన ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఏపీ డేటా తస్కరించాయంటూ హైదరాబాద్ లో కేసులు నమోదవడంతో ఇది వివాదానికి కారణమైంది. అయితే అసలు ఈ రెండు సంస్థలు ఏం చేస్తాయి? వీటిపై వివాదాలకు కారణమేంటి..?

బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇది విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ఐటీ సంస్థ. అయితే దీని ప్రధాన వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానివే.! ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన పలు పథకాలకు సాఫ్ట్ వేర్ సేవలను బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ అందిస్తోంది. రైతు సాధికార సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీటి పారుదల శాఖ… లాంటి ప్రభుత్వ విభాగాలకు అధికారిక సేవలందిస్తోంది బ్లూఫ్రాగ్ సంస్థ. విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ దగ్గర ఆయా పథకాల లబ్దిదారుల వివరాలు నమోదై ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఆ సంస్థే వెబ్ సైట్స్, నిర్వహణ వ్యవహారాలను చూస్తోంది.

ఇక ఐటీ గ్రిడ్స్ అనేది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్ వేర్ సంస్థ. దీని సీఈవో అశోక్..! ఈ సంస్థ ఏపీ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్స్, యాప్స్ వ్యవహారాలన్నీ చూస్తోంది. ఆ పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమం జరిగినా దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందిస్తోంది. అయితే ఇటీవల పార్టీ కోసం విస్తృత స్థాయిలో సేవా మిత్ర అనే యాప్ ను రూపొందించింది. ఇందులో పార్టీ అధినేత నుంచి బూత్ లెవల్ కార్యకర్తల వరకూ సమాచారాన్ని పొందు పరిచారు.

అసలు ఈ కంపెనీలు ఏం చేశాయి :

ఐటీ గ్రిడ్ రూపు దిద్దిన సేవ మిత్రా యాప్ కి బ్లూ ఫ్రాగ్ తన దేగ్గరున్న డేటా ని మొత్తం ప్రభుత్వ సమాచారాన్ని వోటర్ జాబితాని ఇలా తన దేగ్గర ఉన్న కీలక ఇన్ఫర్మేషన్ ని ఐటీ గ్రిడ్ కి అందించింది అనే ప్రదాన ఆరోపణ బ్లూ ఫ్రాగ్ పై ఉంది. ఇక ఐటీ గ్రిడ్ సేవ మిత్రా అనే యఫ్ ద్వారా సర్వే చేస్తున్నాము అని చెప్పి తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ని టీడీపీ ముఖ్య నేతలకి అందిస్తుంది. ఇక టీడీపీ ముఖ్య నేతలు ఏదో ఒక కారణం చూపి వారి వోటర్ హక్కుని నిషేదించేలా సన్నాహాలు చేస్తున్నారని కథలు వినపడుతున్నాయి. ఇది తెలిసిన వై‌సి‌పి నేత గుర్రంపాటి దశరత్ దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇక అక్కడ మొదలయ్యింది ఈ రాద్దాంతం.

Share.

Comments are closed.

%d bloggers like this: