నన్ను బెదిరించే దైర్యం ఎవ్వరికీ లేదు-వై‌సీపీ నేత

Google+ Pinterest LinkedIn Tumblr +

రఘురామకృష్ణం రాజు నిన్న వై‌సీపీ అధినేత వై‌ఎస్ జగన్ సమక్షం లో వై‌సి‌పి లో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తనకి జగన్ తో అభిప్రాయ భేదాలు ఉన్న మాట నిజమే అని చెప్పిన ఆయన తనకి జగన్ తో వ్యక్తిగతంగా ఎటువంటి తగాదాలు లేవని చెప్పాడు. జగన్ తో మంచి అనుబందం తనకి ఉందని తాను వై‌ఎస్ హయాంలో పని చేశానని అదే అభిమానం ఇప్పుడు మళ్ళీ వై‌సీపీ లోకి వచ్చేట్టుగా చేసిందని ఆయన అన్నారు.

ఇక నేడు తనను బెదిరించే ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదని వైసీపీ నేత, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాను వైసీపీలోకి వచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనేనని చెప్పుకొచ్చారు.

వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకే తిరిగి వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తేనే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారంటూ చేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: