ముచ్చటగా మూడోసారి ‘ఆర్య’ కాంబినేషన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్య ఆర్య 2 సినిమాలు మైలు రాళ్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ కి మంచి హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక తరహా లో ఆర్య 3 సినిమా ఎప్పుడా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అయితే బన్నీ కి ఇంత మంచి హిట్స్ అందించాడు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాతో భారీ హిట్ అందుకున్న సుకుమార్ కి ఇప్పుడు మంచి మార్కెట్ నడుస్తుంది. అంతకుముందు నాన్నకి ప్రేమతో ఇలా వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు సుకుమార్. ప్రస్తుతం హీరోలందరూ సుకుమార్ తో ఒక సినిమా చేయాలని తరసా పడుతున్నారు అనే చెప్పాలి.

అయితే ఆర్య కాంబినేషన్ మరోసారి పట్టలేక్కబోతుంది అని కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు నిజమా కాదా అంటూ బన్నీ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అయితే నేడు మహా శివరత్రి అవ్వడం తో వీరి కాంబినేషన్ కన్ఫామ్ అయినట్టు సుకుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో బన్నీ అభిమానులు ఎప్పటినుండో చూడాలి అనుకునే సినిమా త్వరలో వచ్చేస్తుంది అని ఉత్సాహం లో ఉన్నారు.

ప్రస్తుతం బన్నీ తన 19 వ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ సినిమా తరువాత తన 20 వ సినిమా సుకుమార్ తోనే చేయబోతున్నారట. ఇక ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించబోతుంది అని సమాచారం. ఇక మహేశ్ బాబు తో సుకుమార్ సినిమా రాబోతుంది అనే వార్తా లేకపోలేదు. ఇక సుకుమార్ మహేశ్ తో సినిమా పూర్తి చేసి బన్నీ తో సినిమా తీయనున్నారట.

Share.

Comments are closed.

%d bloggers like this: