చర్జింగ్ బస్సులు..! భారీ ఛార్జీలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ లో ఇక నుంచి ఎలక్ట్రిక్ బస్సులు షురూ..! ఈ బస్సుల వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుందట. కాలుష్యాన్ని తగ్గించడానికే ఈ బస్సులని అమలులోకి తెచ్చారంటా. … హైదరాబాద్‌లో మంగళవారం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా 40 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని టీఎస్‌ ఆర్టీసీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ బస్సులను ట్రయల్ చేసినప్పుడు అద్భుతంగా పనిచేశాయని స్మాచారమ్. నేడు సాయంత్రం మియాపూర్ నుండి ఈ బస్సులు కదలబోతుంది.

టీఎస్‌ ఆర్టీసీ ఎండీతో పాటు బస్సుల్ని తయారుచేసిన సంస్థ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మియాపూర్‌-2, మరియు కంటోన్మెంట్‌ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ రూట్లలో వీటిని నడపనున్నారు. అచ్చం ఏసీ బస్సు మాదిరిగానే ఉండే ఈ బస్సు.. ఛార్జీలు కూడా ఏసీ బస్సు మాదిరిగా వసూళ్లు చేయనున్నారు.

ఈ బస్సులు నడిచేదే చర్జింగ్ మీద కాబట్టి వీటికి చర్జింగ్ అంధించడానికి చర్జింగ్ స్టేషన్లు కావాలి. ప్రస్తుతానికి ఈ బస్సులు మియాపూర్-2 కంటోన్మెంట్ల డిపోలా నుండి పరుగులు తీస్తున్నాయి. అందుకే అధికారులు ఆయా డిపోలలో చర్జింగ్ స్టాషన్లు ఏర్పాటు చేశారు. కేవలం 4 గంటల పాటు చర్జింగ్ అందుతే దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలవు. కాలుష్యానికి నో ఛాన్స్.

అంతా బాగునప్పటికి ఏదో ఒక లోపాన్ని వెలికి తీయడం ప్రజలకి అలవాటే. ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలు అత్యధికంగా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యం తగ్గించే పేరుతో అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేయడం ఏంటి అని ప్రజలు మండిపడుతునారు. అందరూ ప్రయాణించేలా బస్సుల్ని సౌకర్యవంతమైన దరాలు నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: