‘మటన్ రచ్చ’ పై క్లారిటీ ఇచ్చిన సీఐ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇల్లు పీకి పందిరేశారు అంటారు తెలుసా.. కానీ ఇక్కడ మాత్రం పందిరి పీకి ఇంటి ముందు గందరగోళం చేశారు. తాజాగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లో పెళ్ళింట్లో వివాదం జరిగింది. కేవలం పెళ్లి భోజనంలో మటన్ పెట్టలేదంటూ పెళ్లికూతురు బంధువులపై పెళ్ళికొడుకు వారు చెలరేగారు. అక్కడ మొదలయిన వ్య్వహారమ్ కూర్చిలతో కర్రలో ఆకరికి టెన్త్ సామాగ్రి తో కొట్టుకునేంతవరకు వెళ్లిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 30 మందికి పైగా ఒకే చోట ఇష్టం వచ్చినట్టు బాదుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇక ఈ విషయం బయటకి రావడంతో మటన్ గురించి యుద్దం అంటూ వచ్చిన వీడియోలో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

పోలీసులు రంగం లోకి దిగి అంతా సద్దుమరిగించారు బందువులని అదుపు లోకి తీసుకున్నారు. అయితే పూర్తి విచారణ చేసిన పోలీసులు ఇదంతా మటన్ గురించి తలెత్తిన వివాదం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే స్థానిక బూర్గంపాడు సీఐ రమేశ్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు సీఐ కధనం మేరకు.. పెళ్లికి తాగొచ్చిన వరుడి స్నేహితులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పేందుకు వేదిక పైకి వెళ్లిన సందర్భంలో వివాదం తలెత్తిందన్నారు. వేదిక చిన్నదిగా ఉండటంతో.. అంతమంది ఒకేసారి వేదిక పైకి వెళ్లవద్దని వధువు తరుపువారు వారిని వారించినట్టు చెప్పారు. దీంతో వరుడి స్నేహితులకు, వధువు బంధువులకు మధ్య వాగ్వాదం మొదలైందని.. అది కాస్త ఘర్షణకు దారితీసి ఇరు వర్గాలు దాడులు చేసుకునేదాకా వెళ్లిందన్నారు. ఘర్షణలో దాదాపు 10మంది వరకు గాయపడినట్టు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలోనూ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందన్నారు. ఇక ఈ రచ్చ మటన్ గురించి కాదని తేలిపోయింది.

Share.

Comments are closed.

%d bloggers like this: