Advertisements

కేసీఆర్ బయటకి రా.. తేల్చుకుందాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ లపై నిప్పులు చరిగారు. దమ్ముంటే బయటకి రా.. చూసుకుందాం అంటూ కెసిఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కెసిఆర్ మోదీ జగన్ లని ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారంటూ ఆయన చెలరేగారు.

ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డేటా డ్రామా, కుట్రలను ప్రజలంతా చూస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన లో యాభై లక్షల భోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పిన నాడే ఈ డ్రామా ప్రారంభం అయ్యింది. వైసిపి నేతలు లోకేష్ రెడ్డి, విజయ సాయి రెడ్డిలు ఫిర్యాదులు ఇస్తే కేసిఆర్ స్పందించారు. అర్దరాత్రి ముప్పై మంది పోలీసులను ఐటీ కంపెనీ పై దాడులు చేసి సిబ్బందిని‌ బెదిరించారు.

సామంతరాజు జగన్ నజ గెలిపించాలనే తాపత్రయం తో కేసిఆర్ తప్పుడు విధానాలకు కెసిఆర్ పాల్పడ్డారు.. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో కి తీసుకువెళ్లి చర్చ పెడతాం అని ఆయన అన్నారు. 2014లోనే జగన్ గెలుస్తాడని కేసిఆర్ జోస్యం చెప్పాడు.. 2019లో ఎలాగైనా జగన్ ను గెలిపించాలని ముసుగు రాజకీయాలు చేస్తున్నాడు.

కేసిఆర్ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి నీ ముసుగు తీయి.. నీలాగా ముసుగు వేసుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు.. దమ్ముంటే ధైర్యం గా రా… ఎన్నికల క్షేత్రం లో తేల్చుకుందాం.. నేరుగా ప్రజల్లోకి రా.. వారే నీకు బుద్ది చెబుతారు మోదీ కేసిఆర్ లు జగన్ ను సిఎం చేయాలనే చంద్రబాబు పై అనేక కుట్రలు చేస్తున్నారు..ప్రజలకు అన్నీ అర్దమవుతున్నాయి, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: