బడి అంటేనే ఓ గుడి అని అర్ధం.. అటువంటి బడిలో పిల్లలకు పాఠాలు చెప్పవలసిన ఉపాద్యాయుడు ఓ యువతికి ప్రేమ పాఠాలు నేర్పాడు…ఆ ప్రేమపాఠాలతో దేవాలయం లాంటి ఆ బడి ని ఒక లాడ్జిలా మార్చాడు…అక్కడ ఉన్న విద్యార్ధులను ఆవరణంలో ఆటలకు పంపేసి క్లాస్ రూమ్లో ఆ యువతితో రోమాన్సులు చేసాడు… కొంత కాలం తరువాత బయటపడింది ఆ ఉపాద్యాయుడు బాగోతం… ఇక చేసేది ఏమీలేదని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు… కాలయాపన చేస్తూ కొంతకాలం నెట్టికొచ్చాడు..తీరా నిలదీస్తే కాదుపొమ్మన్నాడు….
శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం కోరికపుట్టిగ ప్రాధమిక పాఠశాలలో ఎస్.జి.టి గా విధులు నిర్వహిస్తున్న దేశపాక దుర్గాప్రసాద్ అనే ఉపాద్యాయుడు గతరెండేళ్లుగా సంతబొమ్మాళి మండలం, ఇజ్జివరం కి చెందిన ఓ యువతిని ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి మోసగించాడు.. ప్రతి రోజు యువతి చదువు తన్న నర్సింగ్ కళాశాల వద్దకు వెళ్లి, అక్కడ నుండి తాను విధులు నిర్వహిస్తున్న కంచిలి స్కూల్ కి తీసుకు పోయి అక్కడ అమ్మాయితో స్కూల్ లోనే తన పని కానిచ్చే వాడు, విద్యార్థులు రూమ్ లో ఉంటే వారికి గ్రౌండ్ లో కి పంపించి రొమేన్స్ సాగించేవాడు ఇలా కొన్నాళ్ళు సాగిన తర్వాత స్కూల్ లో మిగతా సిబ్బంది నిలదీసినా తాను వారికి బెదిరింపులు చేసి అక్కడ నుండి తన ఆంతరంగిక మందిరం లోకి తీసికు పోయి పని కానిచ్చే వాడు. ఇలా 2 ఏళ్ళు సాగి తర్వాత అనుమానం వొచ్చిన యువతీ పెళ్లి చేసుకోవాలని కోరగా పెళ్లికి తమ పెద్దలు ఒప్పుకోవడంలేదని ముఖం చాటేసే ప్రయత్నం చేసాడు..దీంతో యువతి విషయాన్ని గ్రామపెద్దలకు తెలియ జేయగా ఇరువురిని పిలిచి పంచాయితీ పెట్టారు.. తాను పెళ్లి చేసుకోనని 3లక్షలు ఇస్తానని దీంతో సర్దుకుపోవాలని పెద్దలకు స్పష్టం చేసాడు.. పెద్దలు ఒప్పించినప్పటికీ అంగీకరించని ఆమె పోలీసులను ఆశ్రయించింది..
పెద్దలను , పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఇంతవరకూ తనకు న్యాయం జరగలేదని , న్యాయం జరిగే అవకాశం కనిపించకపోవడంతో మహాన్యూస్ను ఆశ్రయించారు జరిగిని అన్యాయాన్ని గుర్తించి నాకు న్యాయం జరిగే వరకూ వెన్నంటే వుండాలి అని మహాన్యూస్ను వేడుకుంది….