సుక్కుతో సినిమా అందుకే ఆగిపోయింది- మహేశ్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు అశ్విని దత్త్ లో స్వీయ నిర్మాణంలో సూపర స్టార్ మహేశ్ బాబు మహర్షి సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల నటి పూజ హెగ్డే కథానాయికగా నటింస్తుంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశల్లో ఉంది. వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మరోసారి సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ సినిమా తీయబోతున్నారు అని గట్టి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుందని అప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్టు చిత్రా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నిన్న శివరాత్రి సందర్భంగా సుకుమార్ అల్లు అర్జున్ ల సినిమా పై క్లారిటీ ఇచ్చారు. త్వరలో సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా తీయబోతున్నారు అని అధికారిక ప్రకటన చేశారు. కొంతకాలంగా మహేశ్ బాబు తో సినిమా తీస్తానన్న సుకుమార్ సడన్ గా బన్నీ తో సినిమా అనే సరికి అభిమానుల్లో అనేక సందేహాలు వచ్చాయి. వీరిద్దరికి విభేదాలు ఉన్నాయంటూ అప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొచ్చాయి.

అయితే ఈ రూమర్స్ కి సమాప్తం పలికేందుకు మహేశ్ తాజాగా ట్వీట్ చేశారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో సినిమా చేయడం లేదని చెప్పాడు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుక్కూకి ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా సుకుమార్‌పై సూపర్ స్టార్ ప్రశంసలు గుప్పించాడు. సుకుమార్ అంటే నాకెంతో గౌరవమన్న ప్రిన్స్.. 1 నేనొక్కడినే సినిమా ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందన్నాడు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: