జైషే చీఫ్ ని జైషే క్యాంప్ కు తరలింపు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అంతర్జాతీయ తీవ్రవాది పుల్వామ ఉగ్రదాడులు చేయించిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవలే కిడ్నీ సమయ్సతో బదపడుతూ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్త కేవలం కల్పిత వార్తలని పాక్ మీడియా కొట్టిపారేస్తుంది. మసూద్ కుటుంబ సభ్యులు కూడా ఆయన చనిపోలేదని స్పష్టం చేశారు. ఇక మసూద్ మరణం పై వచ్చిన వార్తలు కొంత సేపట్లోనే పాకిపోవడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వార్తలు వచ్చిన రెండు రోజుల ముందే పాక్ ఇంటెలిజెన్స్ మంత్రి మసూద్ పాక్ లోనే ఉన్నారంటూ తమతో టచ్ లో ఉన్నాడంటూ ప్రకటించాడు. ఆ సమయం లో మసూద్ ఇలా సమస్య తో బాద పడుతున్నదని గాని ఆర్మీ హస్పేటల్ లో ఉన్నదని కానీ ఎటువంతు సమాచారం ఇవ్వలేదు. ఇక అంతర్జాతీయ మీడియా కూడా మసూద్ మృతి పై ఎటువంటి ప్రకటనలు జారీ చేయలేదు. మసూద్ కుటుంబ సభ్యులు అతను బాగానే ఉన్నదంటూ తాజాగా వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా తాజాగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ని జైషే మహ్మద్ క్యాంపస్ కి తరలించినట్టు వార్తలొస్తున్నాయి. ఇక దీనిపై భారత ఇంటెలిజెన్స్ మాత్రం కరెక్ట్ గా స్పందించగలదు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: