వై‌సీపీ యాక్షన్..! టీఆర్‌ఎస్ ఓవర్ యాక్షన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మీడియా తో మాట్లాడినా ఆయన అనేక విషయాలపై స్పందించారు. మోదీ కేసీఆర్ జగన్ లపై మండి పడ్డారు. తాజాగా కలకలంగా మారిన డేటా చోరీ వివాదం పై ఆయన స్పందిస్తూ వైసీపీ పై విరుచుకపడ్డారు. వైసీపీవి అన్నీ అనైతిక చర్యలే అంటూ ఆయన ఫైరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ డేటా చోరీ జరిగింది.. టీడీపీ పార్టీకి సంబంధించిన డేటా పోయిందని వైసిపి వాళ్లు టీఆర్‌ఎస్ కు పిర్యాధు చేయడం ఆచర్యంగా ఉంది.. ఇది అనైతికమైన చర్యగా ఉంది.. ఇది తెలంగాణ రాష్ట్రం, వైసీపీ సంబంధించినది కాదూ…. అలాంటిది వైసీపీ తెలంగాణకు పిర్యాదు చేయడం ఏంటీ…?.. తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఓవర్ యాక్షన్ చేయడం ఏంటీ..?

83 నుండి రాజకీయాల్లో ఉన్నా ఇలాంటివి ఎప్పుడు చూడలేదు.. స్పీకర్ గా నామీద అనేక చౌకబారు, నీచమైన, అవాస్తవమైన ప్రచారాలు చేయడం జరుగుతుంది.. దమ్ముంటే వైసీపీ నాయకులు ఎదురుగా వచ్చి పోరాడాలి.. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అరాచకాలు చేస్తారో అనిపిస్తుంది..

వైసీపీకి టీఆరెస్, బీజేపీలు తోత్తులుగా మారారు.. గతంలో జగన్ ను విమర్శించిన టీఆరెస్, బీజేపీలు నేడు జగన్ పల్లకి మోస్తున్నారు.. ఎవరూ ఎన్ని కట్రలు పన్నినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే ఈ పార్టీని అధికారంలోకి తీసుకువస్తుంది.. ఈ ప్రభుత్వ పాలనలో నేడు అన్ని వర్గాల వారు సంతృప్తిగా ఉన్నారు.. వైసీపీ చేస్తున్న అనైతికమైన పనులు వారికే నష్టాన్ని తీసుకువస్తాయి అంటూ ఆయన మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: