బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తనకి భారీ ప్రేక్షకాదరన ఉండటం చూసి తన అభిమానులతో కలిసి కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేశారు. తాను బిగ్ బస్ గెలిచినప్పుడు కూడా తనకి వచ్చిన క్యాష్ ఫ్రిజ్ ని క్యాన్సర్ బాదితులకి కర్చు చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే అప్పటి నుండి కౌశల్ సేవ కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం కూడా సేవ చేయడమే.
కానీ గత కొన్ని రోజులుగా కౌశల్ మీద నెగిటివ్ టాక్ వస్తుంది. తన పై విమర్శల వాన కురుస్తుంది. ఈ ఫౌండేషన్ కి చెందిన డబ్బుని కౌశల్ దుర్వినియోగం చేస్తున్నాడని, తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేశారు. మరోపక్క కౌశల్ మాత్రం ఇవన్నీ అవాస్తవాలని ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నాడు.
ఇలా వార్తలు గుప్పుమనడం తో కౌశల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని రోజులపాటు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని రద్దు చేయాలని రద్దు చేయాలని భావించాడు. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒకదాని లో కౌశల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి దేశ స్థాయి కమిటీలను ఆయన రద్దు చేస్తున్నట్టుగా పోస్ట్ చేశాడు. ఇక కొన్ని రోజుల తరువాత కౌశల్ మళ్ళీ ఫౌండేషన్ ని ప్రారంభించి. తానే స్వయంగా సభ్యులని కలుసుకుని వారిని నియమిస్తానని ఆయన ప్రకటించాడు.